సాగాలి భవిష్యతు వైపు వడి వడిగా,
వదిలించుకొని భారమైన గతాన్ని
భారం కాదు నాది మండేలా గతం కన్నా
భారం కాదు నాది గాంధీకొచ్చిన అవమానం కన్నా
భారం కాదు నాది జీసస్ కొచ్చిన కష్టం కన్నా
అనవసర భారాన్ని వదిలించుకొని సాగారు వారు
నిచ్చల మనస్సుతో జాతికే భవిష్యతు నిచ్చారు
భారంలేని బ్రతుకు బాటే బంగారు భవిత
భారం లేని మీరే నాకు ఆదర్శం మనోధైర్యానికి నిదర్శనం
అదే జీవితానికి అర్ధం పరమార్ధం
– కృష్ణ నడింపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *