ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళం
భారత సంస్కృతి వారసులం
అనేక తెలుగువారి జనజీవనభాగ్యం
తదుపరితరాలకుఆదర్శప్రాయం
మేముతెలుగునేలకుచాలాదూరం
అందుకేతెలుగుతీయదనంమరవం
మాసంకరతెలుగువంకరపోదు
శంకరశాస్త్రిలాశారదాఅనేదిలేదు
తెలుగు కార్య క్రమాల హోరు
యేటా తెలుగోళ్ళ ఆటల జోరు
దీపావళి ఉగాది వేడుకల తీరు
స్వరసాహిత్యాల తెలుగు వారు
బహిరంగసభలరచ్చలేదు
అవినీతిపాలనబెంగలేదు
జీహుజూర్గాళ్ళజాడలేదు
కుండలోపుట్టినాకులప్రసక్తిరాదు
సంఘసేవకైచేస్తాంరక్తదానం
వాకింగుల్లోచూపుతాంసంఘటితం
సికాసిక్కాకలుపుతాం
ఒకపక్కాసేవకువాడుతాం
బాక్స్బద్ధలుచేసేదిలేదు
సీన్సితారఅయ్యేదికాదు
కష్టేఫలేఇక్కడినిత్యజీవితం
వైవిధ్యాలెరుగదుమావర్తమానం
తెలుగువారిఔన్నత్యం
ఆస్ట్రేలియాఅంతాచాటుతాం
– మురళి ధర్మపురి