ఏ దేశమేగినా ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి తెలుగు భారతిని
నిలుపరా నీ తెలుగు జాతి నిండు గౌరవం
తెల్లవారికన్న మిన్నగా
అధిగమించాలి అన్నిరంగాలలో
సర్వేపల్లి స్పూర్తితో
కాని, బరితెగించిన ఈ
తెల్ల సమాజంలో మరువరాదు
తెలుగు సంస్కృతి
గురజాడ వారి స్పూర్తితో
అవసరాలకై వాడాలి పరాయి భాష
పోలీస్ డ్రెస్ లా
మనలో నైనా ఇంటిలో నైనా
గౌరవించాలమ్మ భాషను అమ్మలా
పొందాలి గౌరవం తెలుగు భాషా సంస్కృతులు
ఉగాది నాడే గాక అన్ని వేళలా
అందుకై కళ్ళు తెరవాలి యువత
ఈ తెల్ల దేశంలో …
– డి. బసవయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *