ప్రపంచంలోఆడవారుఎందరో
వీరందరిలోతేడాలుఎన్నెన్నో
పరిస్తితులప్రభావాలుమరెన్నో
కలియుగవత్తిళ్ళుఇంకెన్నో
ధనిక, బీద, శారీరకమరియుమానసికతేడాలెనున్నా
ప్రపంచంలోఆడవారుఎందరున్నా
భిన్నత్వంలోఎకత్వంలా
బిడ్డతొలిసారిచనుబాలుపట్టినఅనుభూతి,ఒక్కటే
బిడ్డలు, కనులముందువున్నాలేకున్నా
రెక్కలొచ్చి గూటినుండిఎగిరిపోతున్నా
కన్నవారిమీద నిందలుమోపుతున్నా
నిత్యంబిడ్డలక్షేమాన్నిఆశించేది,”అమ్మ”
ప్రపంచంలోఆడవారుఎందరైనా
వీరిలోని “అమ్మ” మాత్రం ఒకే ఒక్కరు
బిడ్డలపైఆమెచూపేమమకారంఒక్కటే
ఓమనిషి !!!దీనినిగ్రహించిమసలుకో
“అమ్మ” లోని దైవాన్ని గ్రహించుకో
ఏ ఫలితాన్ని ఆశించక, నిత్యం నీ నీడగ నిలుపుకో
“అమ్మ” ని కంటికి రెప్పలా కాపాడుకో….
కలియుగ దేవతగా కొలుచుకో….
– By Anita Chaganti